100% మేడ్ ఇన్ ఇండియా మూవీ

లారీ డ్రైవర్ గా బన్నీ కనిపించనున్నాడు

Allu-Arjun-still-from-Pushpa-Movie

‘పుష్ప’. స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ – అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.

బన్నీ – సుక్కు కాంబినేషన్ లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో అందరి కళ్ళు ఇప్పుడు ఈ సినిమాపైనే ఉన్నాయి.

అంతేకాకుండా ‘రంగస్థలం’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సుకుమార్ రూపొందిస్తున్న సినిమా.

. ‘అల వైకుంఠపురంలో’ సినిమా తర్వాత బన్నీ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇప్పటికే ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కోసం కేరళ వెళ్లాలని ప్లాన్ చేయగా.. కరోనా వచ్చి అన్నిటిని తారుమారు చేసింది.

శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ అంచనాలను పెంచేసింది.

రాయలసీమ చిత్తూరు యాస భాషతో పాటు బన్నీ ఊర మాసు.. మొరటు కుర్రాడిగా కనిపించనున్నాడు.

కాగా ఈ సినిమా మన నేటివిటీకి దగ్గరగా సహజత్వం ఉట్టిపడేలా పాత్రలు పండాలంటే లోకల్ గానే షూటింగ్ చేయాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయ్యిందంట.

వీటికి సంబంధించిన కొన్ని విషయాలను ప్రముఖ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం :https://www.vaartha.com/telangana/