ఐక్యరాజ్య సమితి పురస్కారం

Priyanka Chopra Selected to Unicef Award
Priyanka Chopra

హాట్ బ్యూటీ ప్రియాంకా చోప్రా ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను అందుకుంది. ఐతే తాజాగా మరో అరుదైన గౌరవాన్ని ఆమె దక్కించుకుంది. ఐక్యరాజ్య సమితి అందించే “యూనిసెఫ్‌ అమెరికా డానీ కేయి మానవతా పురస్కారానికి” ఎంపికైంది. బాలల విద్య, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకుగానూ ప్రియాంకని ఈ అవార్డుకి ఎంపిక చేశారు. ఈ ఏడాది చివర్లో ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారట.

ఈ విషయాన్ని ప్రియాంక ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకుని ఆనందం వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఆమె ‘ది స్కై ఈజ్‌ పింక్‌’ చిత్రంలో నటిస్తుంది. సోనాలి బోస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రమిది.ప్రస్తుతం ప్రియాంక ఎక్కువగా అమెరికాలోనే ఉంటున్నారు. ఆమె నిక్ జోన్స్ పెళ్లాడాకా కేవలం హాలీవుడ్ మూవీస్, టీవీ సిరీస్ లపైనే ఫోకస్ పెట్టారు.