కరోనాపై మరింత సమర్ధంగా పోరు

‘మన్‌ కీ బాత్‌’లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

PM Modi
PM Modi

New Delhi: కరోనా విజృంభణ నేపథ్యంలో భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.  ఆకాశవాణి ద్వారా మన్‌ కీ బాత్‌లో ఆయన ఈ రోజు మాట్లాడారు. 

‘కరోనాపై దేశ ప్రజలంతా చేస్తున్న పోరాటం మరింత సమర్ధంగా  కొనసాగించాలని పిలుపునిచ్చారు.

ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలి. మాస్కులు ధరించాలని సూచించారు. కరోనా వైరస్‌ శ్వాస వ్యవస్థను దెబ్బతీస్తుందన్న ఆయన  యోగా ద్వారా దీన్ని అధిగమించవచ్చునని చెప్పారు.

నిరుపేదలకు ఆయుష్మాన్ భారత్ వరంగా మారిందని ఆయన అన్నారు. 

ఆయుష్మాన్ భారత్ వల్ల  కోటి మంది నిరుపేదలు చికిత్స పొందారన్నారు. కోటిమంది నిరుపేద లబ్ధిదారుల్లో 80 శాతం మంది గ్రామీణులేని తెలిపారు.

వలస కూలీల తరలింపునకు శ్రామిక్‌ రైళ్లు నడుపుతున్నామని మోడీ అన్నారు.

‘కరోనా సమయంలో ఎందరో కొత్త కొత్త ఆవిష్కరణలకు నాంది పలికాని మోడీ పేర్కొన్నారు.

అన్ని రంగాల వారు విశేష కృషి చేస్తున్నారన్న ఆయన మాస్కులు తయారు చేసి మహిళా సంఘాలు చేయూతనిచ్చాయని అభినందించారు.

విద్యా రంగంలోనూ ఎన్నో కొత్త ఆవిష్కరణలు చేశారన్నారు. ‘కరోనా సమయంలో పేదల కష్టాలు వర్ణనాతీతమన్న మోడీ,  కరోనా వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటోందన్నారు.

కాగా, మిడతల దండు దాడి వల్ల నష్టపోయిన వారిని ఆదుకుంటాంమని  అని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/