ప్రెసిడెంట్‌ ట్రంప్‌ ఆసక్తికరమైన గాథ!

వార్తల్లోని వ్యక్తి

Trump tour in india

లోగడ అమెరికా అధ్యక్షులు కొందరు భారతదేశాన్ని సందర్శించకపోలేదు. కాని, నేడు భారతదేశాన్ని సందర్శిస్తున్న డొనాల్డ్‌ ట్రంప్‌ మాత్రం విలక్షణ అధ్యక్షుడు. బహుశా అమెరికాకు ఇలాంటి అధ్యక్షుడు మొన్నెన్నడు వచ్చినట్టు కనిపించదు! మరి, ‘బంగారుపు బైక్‌ వ్ఞన్న అధ్యక్షుడెవ్వరూ లోగడ అమెరికా అధినేత అయినట్టు కనిపించదు! ఆయనకు ఇంకా ఒక బోయింగ్‌ విమానం, ఒక హెలికాప్టర్‌, ఒక నౌక ఉన్నాయి! ఈ రకమైన ఆస్తిపాస్తులున్నవారు అమెరికా అధ్యక్షులలో ఎవ్వరూ కనిపించరు!

ట్రంప్‌ గొప్ప వ్యాపారి! విలాసవంతుడు విలాసవంతులలో ఆయన అగ్రగణ్యుడు. 2019 వరకు ఆయనపై 16 మంది మహిళలు అత్యాచార కేసులు బనాయించారంటే చాలు! ఇంతకుమించి రాయడం నాకు ఇష్టం లేదు.

పార్టీల మార్పిడిలో ఘనుడు

మనదేశంలోని ‘ఆయారామ్‌, గాయారామ్‌లకు ఆయన తీసిపోరు! 1987లో ట్రంప్‌ రిపబ్లికన్‌ పార్టీ, ఆ తరువాత రెండు సంవత్సరాలకు ఆయన ఇండిపెండెంట్‌! మరి 11 సంవత్సరాలకు సొంతంగా ఒక పార్టీని పెట్టి, ఏకంగా అమెరికా అధ్యక్ష పదవికే పోటీ చేసి, గెలవలేదు! ఆ మరుసటి సంవత్సరం రిపబ్లికన్‌ పార్టీకి ప్రత్యర్థి అయిన డెమొక్రాట్‌! మళ్లీ రిపబ్లికన్‌ పార్టీ! ఆ తరువాత తిరిగి ఇండిపెండెంట్‌! 2012లో రిపబ్లికన్‌ పార్టీ! అమ్మయ్య! ఎట్టకేలకు ఆ పార్టీలో నిలబడి, చివరికి 2016లో అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసి డెమొక్రాటిక్‌ అభ్యర్థి హిల్లరీపై పోటీ చేసి, గెలిచారు!

‘అమెరికా అమెరికన్లకే!

ఆ ఎన్నికలలో ట్రంప్‌- ట్రంప్‌కార్డు అమెరికా అమెరికన్లకే! అదే ఆయన అఖండ విజయ నినాదం! ఇదివరకు ఏ అమెరికా అధ్యక్షుడు ఆ నినాదంతో గెలిచినట్టు కనిపించదు! హిల్లరీ క్లింటన్‌పై గెలిచారు. ఆమెకిది రెండవసారి పరాజయం! ఆయనలో మరికొన్ని విశేషాలున్నాయి. ఆయన ఎకనమిక్స్‌లో డిగ్రీ సాధించారు. మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. మూడవ భార్య మెలానియా. ఇప్పుడు ఆమెతోనే వ్ఞన్నారు. వీరికి విలియం అనే కురుమాడు. ట్రంప్‌ ప్రథమ భార్య కుమార్తె ఇవాంక, ఆమె భర్త కుష్నర్‌ ట్రంప్‌కు సహాదార్లు.

పదవీ గండం

ప్రెసిడెంట్‌ ట్రంప్‌కు మొన్ననే గండం తప్పింది. మొన్నటి అధ్యక్ష ఎన్నికలో ఆయన రష్యా సహకారం తీసుకున్నారని, వచ్చే అధ్యక్ష ఎన్నికలలో ప్రత్యర్థిని ఓడించడానికి ఉక్రెయిన్‌తో చేతులు కలిపి దేశద్రోహానికి పాల్పడ్డాడని ట్రంప్‌పై అమెరికా దిగువ సభ అభిశంసన తీర్మానాన్ని ఆమోదిస్తే, ఎగువ సభ సెనెట్‌ దాన్ని త్రోసిపుచ్చడం ట్రంప్‌కు అఖండ విజయం. ఎగువ సభలో కూడా అభిశంసన తీర్మానం నెగ్గితే? ఇంకేమున్నది? కథ కంచికి ట్రంప్‌..

కొసమెరుపు వ్యాఖ్య

భారతదేశం వచ్చే ముందు ట్రంప్‌ ఒక మాటన్నారు.’భారతీయుల కు నేనంటే ఇష్టంలేదు.భారతీయ ప్రధాని నరేంద్రమోడీకి నేనంటే ఇష్టం అని! డొనాల్డ్‌ ట్రంప్‌ వయస్సు73 సంవత్సరాలు.

  • డాక్టర్‌ తుర్లపాటి కుటుంబ రావు,(‘పద్మశ్రీ అవార్డు గ్రహీత)

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/