కార్యాలయాల్లో ఫోటోలు అవసరం లేదు

గోడలపై ఫోటోలను వద్దన్న ఉక్రెయిన్‌ దేశాధ్యక్షుడు

Volodymyr Zelenskiy
Volodymyr Zelenskiy, ukraine president

ప్రపంచదేశాల్లో దేశాధ్యక్షులు, ప్రధానమంత్రులు గాని ఐనప్పుడు వారి చిత్రపటాలను ప్రభుత్వ కార్యాలయాల్లో ఉంచుతారు. ఇది చాలా దేశాల్లో అమలవుతున్న సాంప్రదాయం. కానీ ఉక్రెయిన్‌ దేశాధ్యక్షుడు మాత్రం ప్రభుత్వ కార్యాలయాల్లో అధ్యక్షుడి ఫోటోలను ఉంచడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఉక్రెయిన్‌ దేశాధ్యక్షుడిగా వ్లాదిమర్‌ జెలెన్స్‌కీ నూతనంగా ఎన్నికయ్యాడు. పదవి స్వీకారం చేస్తున్న సమయంలో ఆయన దేశంలోని ఇతర ప్రజాప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. తాను దేశాధ్యక్షుడినే గాని, చిత్రపటాన్ని గాని కాదని అన్నారు. ఈ నేపథ్యంలోని తన ఫోటోలను ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాల్లో పెట్టవద్దంటూ సూచించారు. కాగా ఆయన ఫోటోల బదులు తన పిల్లల ఫోటోలను గోడలపై ఉంచాలని ఆయన సూచించారు. ఆయన దేశాధ్యక్షుడు కాక ముందు ఒక టివి కమెడియన్‌గా పనిచేశారు. చట్టం ముందు అందరూ సమానమే అని, అందరం కలిసి దేశాభివృద్ధి కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన సభను ఉద్దేశించి మాట్లాడారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: