రావత్‌కు పరమ్‌ విశిష్ట్‌ సేవా పురస్కారం

President Kovind, Bipin Rawat
President Kovind, Bipin Rawat

న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలోని పాకిస్థాన్ సరిహద్దుల్లో అత్యంత ధైర్యసాహసాలు చూపించి ఉగ్రవాదులను మట్టుపెట్టిన ఆర్మీ అధికారులు, జవాన్లకు రాష్ట్రపతి ఈరోజు శౌర్యచక్ర మెడల్స్ ను ప్రదానం చేశారు.సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్‌కు పరమ్ విశిష్ట్ సేవా పురస్కారం వరించింది. ఆర్మీ జవాన్ వ్రహ్మపాల్ సింగ్, సీఆర్పీఎఫ్ జవాన్లు రాజేంద్ర నైన్, రవీంద్ర బబ్బన్, మేజర్ తుషార్ గౌబలకు కీర్తి చక్ర పురస్కారాలు వరించాయి. ఆర్మీ, సీఆర్పీఎఫ్‌కు చెందిన 12 మంది అధికారులు, జవాన్లు శౌర్యచక్ర పురస్కారాలు అందుకున్నారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/