బాలసుబ్రహ్మణ్యం మరణంపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం

బాలు మరణంతో మన సాంస్కృతిక ప్రపంచం కడు నిరుపేదగా మారిపోయింది: ప్రధాని

president-and-prime-minister-condolences-to-sp-balasubrahmanyam-demise

న్యూఢిల్లీ: బహుభాషా గాయకుడు బాలసుబ్రహ్మణ్యం ఇక లేరన్న వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మృతిపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడి స్పందించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అస్తమయంతో సినీ రంగం ఓ మధుర గాత్రాన్ని కోల్పోయిందని రామ్ నాథ్ కోవింద్ తెలిపారు. ‘పాడుమ్ నిలా’, ‘పాటల చందమామ’ అంటూ అశేష అభిమాన జనం ఎంతో ప్రేమగా పిలుచుకునే ఎస్పీ బాలు పద్మభూషణ్ సహా అనేక జాతీయ అవార్డులు అందుకున్నారని వెల్లడించారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి, స్నేహితులకు, వీరాభిమానులకు సంతాపం తెలియజేస్తున్నానని ప్రకటన చేశారు.

లెజెండరీ సింగర్ ఎస్పీ బాలు కన్నుమూసిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎస్పీ బాలు మరణం దురదృష్టకరం అన్న ప్రధాని మన సాంస్కృతిక ప్రపంచం ఒక్కసారిగా కడు నిరుపేదగా మారిపోయిందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా బాలు పేరు ప్రతి ఇంటా వినిపించేదని, దశాబ్దాలుగా ఆయన మధుర కంఠస్వరం, సంగీతం శ్రోతలను అలరించిందని తెలిపారు. ఈ విచారకర సమయంలో ఆయన కుటుంబానికి, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని ట్వీట్ చేశారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/