దీదీతో ప్రశాంత్‌కిశోర్‌ రాజకీయ ఒప్పందం

ఈ నేపథ్యంలో ప్రశాంత్‌ కిశోర్‌పై జేడియూ ఆగ్రహం!

mamata banerjee, prashant kishor
mamata banerjee, prashant kishor

పాట్నా: బీహార్‌లోని అధికార పార్టీ జేడీయూ ,ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ఐన ప్రశాంత్‌ కిషోర్‌పై వేటు వేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఆయన స్వతహాగా జేడియూ కార్యకర్త ఐనా రాజకీయ వ్యూహకర్తగా పనిచేస్తూ 2014లో మోది, 2015లో నితీశ్‌, 2019లో జగన్‌కు గెలుపునందించడంలో ఆయన ప్రముఖ పాత్ర వహించారు. ఈ నేపథ్యంలో తృణమూల్‌లో ప్రశాంత్‌ కిషోర్‌ ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో ఆగ్రహించిన జేడీయూ ప్రశాంత్‌కు ఉద్వాసన పలికేలా కనిపిస్తుంది. ఐతే ఈ వార్తలపై జేడియూ ప్రతినిధి అజ§్‌ు అలోక్‌ మాట్లాడుతూ..పార్టీకి దీంతో ఎలాంటి సంబంధంలేదని, ఎవరికి వ్యూహకర్తగా పనిచేయాలనేది ఆయన వ్యక్తిగత విషయం, దాంతో పార్టీకి పనేమీలేదని అన్నారు. పార్టీలో ప్రశాంత్‌ కూడా భాగమేనని బీహార్‌ సియం నితీశ్‌ అన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లో బిజెపి ఊహించని రీతిలో సీట్లు సాధించడంతో బెంగాల్‌ సియం మమతా బెనర్జీ అప్రమత్తమయ్యారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌తో ఆమె ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకు సంబంధించి కోల్‌కత్తాలో రెండు గంటలపాటు దీదీ-ప్రశాంత్‌కు మధ్య చర్చలు జరిగాయి. ఏపిలో వైఎస్‌ఆర్‌సిపి ఘన విజయంతో ప్రశాంత్‌ కిశోర్‌ వ్యూహాల పట్ల ఆమె ఆసక్తి చూపినట్లు తెలుస్తుంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/