ఈ 16న అఖిలపక్ష సమావేశం

prahlad joshi
prahlad joshi


న్యూఢిల్లీ : ఈ నెల 16న అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ప్రకటించారు. ఈ సమావేశానికి అన్ని పార్టీల లోక్‌సభాపక్ష నేతలు హాజరు కావాలని ఆయన కోరారు. 17వ తేదీ నుంచి పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఇక 16వ తేదీ సాయంత్రం ఎన్డీఏ నేతలు సమావేశమై పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. బిజెపి పార్లమెంటరీ పార్టీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ అదే రోజు సాయంత్రం సమావేశం కానుంది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/