అమెరికాలో కాల్పులు..ఒకరి మృతి

రోడ్డుపై ముగ్గురు ఆఫ్రో అమెరికన్ల కాల్పులు

people shot in Northwest, Columbia

అమెరికా: అమెరికా వాషింగ్టన్ జిల్లా వాయవ్య ప్రాంతంలోని 14వ వీధి స్ప్రింగ్ రోడ్డు వద్ద కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డుపై నిన్న సాయంత్రం దాదాపు 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కాల్పులు జరిపిన ముగ్గురు ఆఫ్రో అమెరికన్లని మెట్రోపాలిటన్‌ పోలీసు చీఫ్‌ పీటర్‌ న్యూషామ్‌ తెలిపారు. వీరిలో ఇద్దరు పెద్ద తుపాకులతో కాల్పులు జరపగా, మరొకరు పిస్టల్‌తో కాల్చినట్టు వివరించారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. సీసీ కెమెరాల సాయంతో దుండగుల కోసం పోలీసులు వేట ప్రారంభించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, మొత్తం పది సెకన్లలో అంతా అయిపోయిందని, టపాసులు కాల్చిన శబ్దం వచ్చిందని అధికారులు తెలిపారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/