సంతృప్తితో స్వదేశానికి ప్రధాని మోది

PM Modi
PM Modi

న్యూఢిల్లీ: ఒసాకాలో 14వ జీ20 సమ్మిట్‌తో పాటు పలు దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోది తిరిగి ఇవాళ న్యూఢిల్లీ బయల్దేరారు. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం ట్విట్టర్లో ప్రకటించింది. మూడు రోజుల జపాన్‌ పర్యటన సందర్భంగా ప్రధాని మొత్తం 9 ద్వైపాక్షిక సమావేశాలు, వివిధ దేశాలతో మూడు సంయుక్త సమావేశాలు నిర్వహించారు. కాగా ఈ సమావేశాలన్నింటిలో ట్రంప్‌తో జరిగిన సమావేశానికే ప్రాధాన్యత ఉంది. మోది అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి సమావేశం.
కాగా జీ-20 సమావేశాలతో పాటు మరో ఐదు కీలక సమావేశాల్లో ప్రధాని పాల్గొన్నారు. వియత్నాం ప్రధాని నుయెన్‌ జువాన్‌ పుక్‌తో పాటు, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు, సింగపూర్‌ ప్రధాని, ఇటలీ అధ్యక్షుడు, చిలీ అధ్యక్షుడు తదితరులతో ప్రధాని సమావేశం అయ్యారు. తీవ్రవాదం, జాతావివక్షకు అన్ని మాధ్యమాలకు చెక్‌ పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

తాజా హీరోల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actors/