లోక్‌సభ సభ్యుడిగా మోది ప్రమాణం

narendra modi
narendra modi, pm


న్యూఢిల్లీ: 17వ లోక్‌సభ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారం చేపట్టారు. తొలుత ప్రధానమంత్రి, ఎన్డీయే పక్షనేత నరేంద్ర మోది లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా ప్రొటెం స్పీకర్‌గా వీరేంద్ర కుమార్‌, తర్వాత ప్రధాన విపక్షమైన కాంగ్రెస్‌నుంచి సురేశ్‌ కొడికున్నిల్‌, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, హోంమంత్రి అమిత్‌ షా తదితరులు ప్రమాణస్వీకారం చేశారు.
నేటి నుంచి 26 వరకు లోక్‌సభ సమావేశాలు జరగనున్నాయి. జులై 5న బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశాల్లో త్రిపుల్‌ తలాక్‌ సహా 10 ఆర్డినెన్స్‌లకు చట్టం రూపం తేవాలని కేంద్రం ప్రయత్నిస్తుంది.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/