భారత బలగాలను కించపరిచేలా మాట్లాడడం సిగ్గుచేటు

modi, pm
modi, pm

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లోని బాలాకోట్‌పై భారత వాయుసేన జరిపిన దాడుల వాస్తవికతను ప్రశ్నిస్తూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శామ్‌ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోది తీవ్రంగా మండిపడ్డారు. భారత బలగాలను కించపరిచేలా మాట్లాడడం సిగ్గుచేటని ఇది దేశాన్నే అవమానించినట్లేనని ప్రధాని దుయ్యబట్టారు.
ఉగ్రదాడికి దీటుగా బదులివ్వడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదని యావత్‌ దేశానికి తెలుసు, కాని ఇది నవ భారతం, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఉగ్రవాదులకు వారి భాషలోనే మేం సమాధానం చెప్పాం. ఉగ్రవాదుల పక్షం మాట్లాడడం, మన సాయుధ బలగాలను ప్రశ్నించడం ప్రతిపక్షాల సహజ నైజం. కశ్మీర్‌ రక్షణ కోసం ప్రాణత్యాగం చేస్తున్న జవాన్లను ప్రతిపక్ష నేతలు కించపరుస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై దేశ ప్రజలు ప్రతిపక్ష నేతలను ప్రశ్నించడని మోది కోరారు. ఇలాంటి అవమానకర వ్యాఖ్యలను ఎప్పటికీ క్షమించబోమని వారికి అర్ధమయ్యేలా చెప్పండి. జవాన్లకు ఈ దేశం ఎప్పటికీ అండగా నిలుస్తుందని మోది పేర్కోన్నారు.