ఇమ్రాన్‌ ఖాన్‌కు మోడి శుభాకాంక్షలు

PM Modi and Pakistan PM Imran Khan
PM Modi and Pakistan PM Imran Khan

ఇస్లామాబాద్‌: పుల్వామా ఉగ్రదాడి, బాలాకోట ఉగ్రస్థావరంపై భారత వాయుసేన దాడి తరువాత భారత్‌, పాకిస్థాన్‌ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు పాకిస్థాన్‌ జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడి పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ సందేశం పంపారు. ఈ విష‌యాన్ని ఇమ్రాన్ త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా వెల్ల‌డించారు. రెండు దేశాల మ‌ధ్య‌ శాంతి, సామ‌ర‌స్యం అవ‌స‌ర‌మ‌ని ఇమ్రాన్ అన్నారు. కాగా అయితే మోదీ పంపిన గ్రీటింగ్ సందేశాన్ని ఇమ్రాన్ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు. జాతీయ దినోత్స‌వం సంద‌ర్భంగా పాక్ ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు చెబుతున్నాన‌ని, ఉగ్రవాద, హింస రహిత వాతావరణంలో ప్రజాతంత్ర శాంతియుత, ప్రగతిశీల శ్రేయోదాయక ప్రాంతంగా భారత్ ఉపఖండాన్ని అభివృద్ధి చేసేందుకు ఇరు దేశాలు కలిసి పని చేయాల్సిన సమయం ఆసన్నమైందని ప్రధాని మోదీ తన సందేశంలో పేర్కొన్నట్లు ఇమ్రాన్ ట్వీట్‌లో చెప్పారు. మోదీ పంపిన సందేశానికి ఇమ్రాన్ వెల్క‌మ్ చెప్పారు. ఇరు దేశాల మ‌ధ్య ఉన్న అన్ని స‌మ‌స్య‌ల‌పై స‌మ‌గ్ర‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టాల్సిన త‌రుణం ఆస‌న్న‌మైంద‌ని ఇమ్రాన్ అన్నారు. క‌శ్మీర్ అంశం గురించి కూడా చ‌ర్చించాల‌న్నారు. రెండు దేశాల ప్ర‌జ‌ల శాంతి, సౌఖ్యం కోసం కొత్త బంధాల‌ను ర‌చించాల‌న్నారు.


మరిన్ని తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/