మహిళా బిజెపి ఎంపీలకు మోది అల్పాహార విందు

Narendra Modi
Narendra Modi

న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని నరేంద్ర మోది నివాసంలో బిజెపి మహిళా ఎంపీలకు నేడు ప్రధాని మోది అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఎంపీలు, ప్రభుత్వానికి మధ్య పరస్పర సహకారాన్ని పెంచేందుకే ఈ తరహా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు బిజెపి వర్గాలు వెల్లడించాయి. ఎంపీలు, ప్రధాని మోది మధ్య ఈ తరహా సమావేశం జరగడం ఈ మధ్య కాలంలో ఇది ఐదోసారి కావడం గమనార్హం. ఇలాంటివి మరో రెండు సమావేశాలు ఉంటాయని పార్టీ నేతలు అంటున్నారు. మొదటగా ఓబిసి ఎంపీలతో, ఆపై ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఎంపీలతో మోది సమావేశమై పలు అంశాలు, సమస్యలపై చర్చించి, ఎంపీల నుంచి సలహాలు తీసుకున్నారు.

తాజా యాత్ర వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/tours/