న్యాయస్థానం తీర్పుకు విశేష స్పందన వచ్చింది

ఢిల్లీ సుప్రీం కోర్టు ప్రాంగణంలో అంతర్జాతీయ న్యాయ సదస్సు మోడి

pm modi
pm modi

న్యూఢిల్లీ: శనివారం ఢిల్లీలోని సుప్రీం కోర్టు ప్రాంగణంలో ప్రధాని మోడి అంతర్జాతీయ న్యాయ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడి మాట్లాడుతూ..ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన న్యాయనిపుణులకు ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను 130 కోట్ల మంది భారతీయులు అంగీకరించారని తెలిపారు. మహాత్మాగాంధీ న్యాయవాది.. గాంధీ ఆచరించిన మార్గంతో న్యాయవ్యవస్థకు పునాది వేశారు. మహాత్మాగాంధీ తన జీవితాన్ని సత్యం, సేవా మార్గంలో కొనసాగించారు. గాంధీజీ తన ఆత్మకథలో, తన జీవితంలో పోరాడిన మొదటి దావా గురించి రాశారు అని మోడి గుర్తు చేశారు.

ప్రపంచం అనేక సమస్యలు ఎదుర్కొంటోందని ప్రధాని పేర్కొన్నారు. దేశంలో సంక్లిష్ట పరిస్థితుల పరిష్కారానికి న్యాయవ్యవస్థ కృషి చేస్తోందని చెప్పారు. నిరంతర అధ్యయనంతోనే కొత్త విషయాలు తెలుసుకోవచ్చునని, వ్యవస్థలో మార్పులు హేతుబద్ధంగా, చట్ట ప్రకారం ఉండాలని సూచించారు. భారతదేశ శాసన, న్యాయశాఖలు పరస్పరం గౌరవించుకుంటాయన్నారు. 70 ఏళ్ల భారత రాజకీయ వ్యవస్థలో మహిళలకు సముచిత ప్రాధాన్యం కల్పించామని, మహిళలకు ఓటు హక్కు కల్పించిన ప్రముఖ దేశాల్లో భారత్‌ ఒకటి అని మోడి తెలిపారు. 135 కోట్ల మంది భారతీయులు తమ సమస్యలను న్యాయవ్యవస్థ ద్వారానే పరిష్కరించుకుంటున్నారని చెప్పారు. లింగ సమానత్వం లేనిది సంపూర్ణ వికాసం ఉండదన్నారు. బీఆర్‌ అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగం కేవలం లాయర్ల డాక్యుమెంట్‌ మాత్రమే కాదు.. అది అందరి జీవితాలకు మార్గదర్శకమని అన్నారు. దేశంలో పర్యావరణ పరిరక్షణకు సుప్రీం తన తీర్పులతో ఎంతో సహకరించిందన్నారు. మారుతున్న సాంకేతికతను న్యాయవ్యవస్థ అందిపుచ్చుకోవాలని మోడి వ్యాఖ్యానించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/