పశ్చిమబెంగాల్‌కు రూ.1000 కోట్లు ప్రకటించిన ప్రధాని

మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు..తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు ఇస్తామన్న ప్రధాని

pm modi

కోల్‌కతా: పశ్చిబెంగాల్‌లో అంఫాను తుపాన్‌ బీభత్సవం సృష్టీంచిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ప్రధాని మోడి ఏరియల్‌ సర్వేకూడా నిర్వహించారు. అనంతరం పశ్చిమ బెంగాల్ కు రూ.1000 కోట్ల ముందస్తు సాయం అందిస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడి ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఇస్తామని, తీవ్రంగా గాయపడిన వ్యక్తులకు రూ.50 వేల చొప్పున అందజేస్తామని తెలిపారు. కాగా నష్టానికి సంబంధించి పూర్తి వివరాలు తెలిశాక మరింత సాయం చేస్తామన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకునేందుకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని మోడి భరోసా ఇచ్చారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/