27న ఐరాసలో మోడీ ప్రసంగం

PM MODI
PM MODI

భారత ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్‌ 27న ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ సమావేశంలో ప్రసంగించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో మోడీ వాతావరణ మార్పు, ఆరోగ్యం, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు, చిన్న ద్వీపాలకు సహకారం వంటి పలు అంశాలపై మాట్లాడనున్నట్లు సమాచారం. భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్‌ 27న రాత్రి 7:30 గంటల నుంచి 8:00 గంటల వరకు మోదీ ప్రసంగించనున్నారని యూఎన్‌ విడుదల చేసిన ప్రాథమిక జాబితా ద్వారా తెలుస్తోంది. ఐరాస సమావేశాల కోసం మోదీ సెప్టెంబర్‌ 23న న్యూయార్క్‌ చేరుకోనున్నారు. పర్యటనలో భాగంగా ప్రవాస భారతీయులతో సమావేశమవుతారు. ఆ తర్వాత యూఎన్‌జీఏ సమావేశంలో ప్రసంగించిన అనంతరం భారత్‌కు తిరిగి పయనమవుతారు. ఈ పర్యటనలో ఆయన పలువురు ప్రపంచ స్థాయి నాయకులతో సమావేశం కానున్నారని సమాచారం.