పాక్‌ గూఢచారి పావురం విడుదల

pigeon

న్యూఢిల్లీ: పాక్‌ గూఢచారి అనే అనుమానంతో భద్రతాదళాలు బంధించిన పావురాన్ని పంజరం నుండి వదిలేశారు. జ‌మ్మూక‌శ్మీర్‌లోని క‌థువా జిల్లాలో గ‌త ఆదివారం గులాబీ రంగు ఉన్న ఓ పావురాన్ని స్థానికులు పట్టుకున్న విష‌యం తెలిసిందే. అయితే ఆ పావురం పాకిస్థాన్ గూఢాచారి అంటూ అక్క‌డ వారు ఆరోపించారు. దాన్ని అధికారుల‌కు కూడా అప్ప‌గించారు. ఎటువంటి అనుమానాస్ప‌ద సంకేతాలు లేక‌పోవ‌డంతో దాన్ని రిలీజ్ చేసిన‌ట్లు సీనియ‌ర్ పోలీసు అధికారి శైలేంద్ర మిశ్రా తెలిపారు. ఆ పావురం ఎక్క‌డ దొరికిందో అదే స్థానంలో దాన్ని విడిచిపెట్టారు. పాక్‌కు చెందిన పావురం ఓన‌ర్ హ‌బిబుల్లా.. ఆ మూగ‌జీవాన్ని వ‌దిలిపెట్టాలంటూ ఇండియాను వేడుకున్నాడు. పావురం కాళ్ల‌పై ఉన్న కొన్ని కోడ్స్‌.. ఉగ్ర‌వాదుల‌కు సంకేతాలు కాద‌ని దాని కళ్లకు ఉన్న రింగు మీద నంబర్లు తన ఫోన్‌ నంబరని ఆయన వెల్లడించారు. అయితే పంజ‌రం నుంచి వ‌దిలిపెట్టిన ఆ పావురం ఓన‌ర్ వ‌ద్ద‌కు చేరిందో లేదో ఇంకా తెలియ‌దు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/