పాకిస్థాన్‌లో కుప్పకూలిన విమానం

ప్రమాదం సమయంలో విమానంలో 99 మంది ప్రయాణికులు 

Pakistan flight crash

కరాచీ : పాకిస్థాన్‌ కరాచీలోని ఘోర విమాన ప్రమాదం జరిగింది. లాహోర్ నుంచి కరాచీ వెళుతున్న పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కరాచీ సమీపంలోని నివాస ప్రాంతాల్లో కుప్పకూలినట్టు స్థానిక మీడియా సంస్థలు తెలిపాయి. ప్రమాదం సమయంలో విమానంలో 99 మంది ఉన్నట్టు…అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది. ఎయిర్‌పోర్ట్‌కు 4 కిలోమీటర్ల దూరంలోని మోడల్ కాలనీ సమీపంలో కుప్పకూలింది. 4 ఇళ్లు దెబ్బతిన్నాయి. భారీ శబ్దంతో పాటు పెద్ద ఎత్తున పొగ రావడంతో జనం పరుగులు తీశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.


తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/