ఫీలిప్పీన్స్‌లో భూకంపం…సునావీ హెచ్చరికలు

Philippines earthquake tsunami
Philippines earthquake tsunami

మనీలా: ఫిలిప్పీన్స్‌  దక్షిణ ప్రాంతంలోని మిందానావో ద్వీపంలో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టరు స్కేలుపై 6.9గా నమోదైందని అమెరికా జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. ద్వీపంలోని జనరల్‌ శాంటోస్‌ అనే నగరానికి ఉత్తరాన 193కిలోమీటర్ల దూరంలో భూప్రకంపనలు సంభవించినట్లు తెలిపింది. భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల పరిధిలో ఉన్న తీరాల్లో  సునామీ వచ్చే ప్రమాదముందని పసిఫిక్‌ సునామీ కేంద్రం హెచ్చరించింది. అయితే అమెరికాకు చెందిన హవాయికి సునామీ ప్రమాదమేమీ లేదని స్పష్టంచేసింది.