సుప్రీంకోర్టులో ‘దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్‌ పై పిటిషన్‌

పిటిషన్ వేసిన న్యాయవాదులు జీఎస్ మణి, ప్రదీప్ కుమార్ యాదవ్

Supreme Court
Supreme Court

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హాత్యాచార నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయింది. పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయవాదులు జీఎస్ మణి, ప్రదీప్ కుమార్ యాదవ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. 2014లో ఎన్ కౌంటర్ విషయంపై సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గ దర్శకాలను పోలీసులు పాటించలేదని వారు అందులో పేర్కొన్నారు. కాగా, చటాన్‌పల్లి సర్వీస్‌ రోడ్డు బ్రిడ్జి కింద గత నెల 28వ తేదీ తెల్లవారు జామున పెట్రోల్‌ పోసి దిశను దహనం చేసిన విషయం తెలిసిందే. ఈ దారుణ ఘటనలో చర్లపల్లి కేంద్ర కారాగారంలో జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న లారీ డ్రైవర్లు మహ్మద్‌ ఆరిఫ్‌, చింతకుంట చెన్న కేశవులు, క్లీనర్లు జొల్లు శివ, జొల్లు నవీన్‌లను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/