ప్రజలు నిశ్చింతగా ఉండండి

దుష్ప్రచారాలు నమ్మొద్దు: శివాజీ

sivaji
sivaji, actor

అమరావతి: ఏపిలో జరిగిన ఎన్నికల సరళిపై నటుడు శివాజీ స్పందించారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను విడుదల చేశారు. బిజెపి ఒక నూతన డ్రామాకు తెరలేపిందని విమర్శించారు. టిఆర్‌ఎస్‌కు 16 ఎంపి సీట్లు, జగన్‌కు 17 ఎంపి సీట్లు వస్తాయని తొలివిడత జరిగిన పోలింగ్‌లో ఎన్డీయేకు మరో 39 సీట్లు కలిపి మొత్తం 72 స్థానాలు తమ సొంతమవుతాయని బిజపి ప్రచారం చేసుకుంటుందని వివరించారు. జగన్‌ బెస్ట్‌ సియం అంటూ ప్రశాంత్‌ కిషోర్‌ పొగడడం వంటి కొన్ని వీడియోలు విడుదల చేశారు.
ఐతే ఇవి కేవలం ఊహలు మాత్రమేనని శివాజీ కొట్టిపారేశారు. మే 23న అనూహ్య ఫలితాలు ఉండబోతున్నాయని శివాజీ ధీమా వ్యక్తం చేశారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/