పేరుకే తమ్ముడు, పవన్‌ నాకూ నాయకుడే

pawan kalyan, nagababu
pawan kalyan, nagababu


హైదరాబాద్‌: ఇవాళ జనసేనలో చేరిన నాగబాబు మాట్లాడుతూ..పేరుకే పవన్‌ కళ్యాణ్‌ తనకు తమ్ముడని, అందరిలాగే తనకు ఆయన నాయకుడని అన్నారు. ఈ సందర్భంగా నాగబాబుకు సంబంధించిన ప్రస్‌నోట్‌ను జనసేన ట్విట్టర్‌ ద్వారా విడుదల చేసింది. తాను ఎత్తుకు ఆడించిన తమ్ముడు పవన్‌ ఇప్పుడు గొప్ప నాయకుడిగా ఎదిగాడు. గొప్ప వ్యక్తిత్వం కల్యాణ్‌బాబుకు ఉంది. తమ్ముడిని ఓ నాయకుడిలా చూడాలని అనుకున్నా, చూశాను అన్నారు. అందరిలా పవన్‌ నాకూ నాయకుడే, పార్టీలో చేరకముందే పవన్‌ కోసం ఏ పని చేయడానికి ఐనా సిద్ధమయ్యాను. తమ్ముడు ఇచ్చిన స్ఫూర్తితోని ముందుకి వెళ్తాను అన్నారు.