31దాకా ప్రయాణీకుల రైళ్లు బంద్

రైల్వే శాఖ ప్రకటన

New Delhi: ప్రయాణీకుల రైళ్లన్నీ మార్చి 31 వరకూ బంద్ చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. గూడ్స్ రైళ్లు మినహా అన్ని రైళ్లనూ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

అలాగే మెట్రో రైళ్లు కూడా బంద్ అవుతాయి.  మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ను కట్టడిచేసేందుకు ప్రధాని పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూకు ప్రజల నుంచి  సంపూర్ణ మద్దతు లభిస్తోంది.

స్వచ్ఛందంగా జనాలంతా ఇళ్లకే పరిమితమై వైరస్‌ను ఓడించేందుకు సిద్ధమయ్యారు. దీంతో దేశ వ్యాప్తంగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. 

 దేశంలో కరోనా మృతుల సంఖ్య ఆరుకి చేరింది.

ఈ ఒక్కరోజే ఇద్దరు చనిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇక దేశంలో వైరస్‌ బారినపడ్డవారి సంఖ్య 324కు పెరిగింది.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/