నేడు ప్రధాని విద్యార్థులతో ‘పరీక్షా పే చర్చా’

యూట్యూబ్, దూరదర్శన్, ఆకాశవాణిలో లైవ్

pm modi
pm modi

న్యూఢిల్లీ: ఈరోజు ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని… తల్కటోరా స్టేడియంలో ప్రధాని నరేంద్రమోడి సారధ్యంలో పరీక్షా పే చర్చ కార్యక్రమం జరగబోతోంది. ఇందులో… 2000 మంది విద్యార్థులు, టీచర్లూ పాల్గొనబోతున్నారు. వీళ్లలో కొందరు ప్రధాని మోదీని పరీక్షలకు సంబంధించి కొన్ని ప్రశ్నలు వేస్తారు. ఇందుకోసం గ్రాటిడ్యూట్ ఈజ్ గ్రేట్, మీ భవిష్యత్తు మీ ఆశయాల్లో, పరీక్షల పరిశీలన, మా విధులుమీ నిర్వహణ, బ్యాలెన్స్ ఈజ్ బెనిఫీషియల్ వంటి థీమ్స్ ఎంపిక చేశారు. ఈ థీమ్స్ ఆధారంగా వేసే ప్రశ్నలకు మోదీ తనదైన శైలిలో సమాధానాలు చెబుతారు. మూడేళ్లుగా ప్రతీ సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల్లో ఉండే భయాలూ, టెన్షన్లను పోగొట్టే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కేంద్రం చెబుతోంది. ప్రతీ సంవత్సరం దీన్ని దూరదర్శన్, ఆకాశవాణిలో లైవ్ ప్రసారం చేస్తోంది. ఈసారి యూట్యూబ్‌లో కూడా లైవ్ ఇస్తున్నారు. అలాగే… దేశవ్యాప్తంగా చాలా స్కూళ్లలో దీన్ని లైవ్‌లో చూసేందుకు వీలు కల్పిస్తున్నారు.

9 నుంచీ 12 తరగతులకు చెందిన 2000 మంది విద్యార్థుల్లో 1050 మందిని ఎస్సే కాంపిటీషన్ నిర్వహించి సెలెక్ట్ చేశారు. మిగతావారిని వేర్వేరు విధానాల్లో సెలెక్ట్ చేశారు. దేశవ్యాప్తంగా దివ్యాంగ స్కూళ్ల నుంచీ… 50 మంది దివ్యాంగ విద్యార్థుల్ని కూడా ఎంపిక చేశారు. వీళ్లంతా ప్రధాని నరేంద్ర మోదీతో డైరెక్టుగా ఇంటరాక్ట్ అవుతారు. మోదీ చెప్పే విశేషాల్ని స్వయంగా వింటారు. దివ్యాంగ విద్యార్థుల్ని ఎంపిక చేసేందుకు ప్రత్యేకంగా పెయింటింగ్ కాంపిటీషన్ నిర్వహించారు. ఎగ్జామ్స్‌లో ఒత్తిడిని జయించడం ఎలా అనే అంశం ఇచ్చి… దాని ఆధారంగా పెయింటింగ్ వెయ్యమన్నారు. చక్కగా పెయింటింగ్స్‌ వేసిన విద్యార్థుల్ని ఎంపిక చేశారు. మరో స్పెషల్ ఏంటంటే… చక్కటి పెయింటింగ్స్‌ని ఈ కార్యక్రమంలో ప్రదర్శనకు పెట్టబోతున్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/