పాక్‌లో రైలు ప్రమాదం, 10 మంది మృతి

సిగ్నల్‌లో పొరపాటు జరగడంతోనే రైలు ప్రమాదం

tain accident
tain accident

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో దక్షిణ పంజాబ్‌లో గురువారం ఉదయం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 10 మంది మరణించగా, సుమారు 90 మంది దాకా గాయపడ్డారని సమాచారం. సాదిఖాబాద్‌లోని వాల్హర్‌ రైల్వేస్టేషన్‌లో పట్టాలపై నిలిపివున్న గూడ్స్‌ రైలును అక్బర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొంది. అక్బర్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చే సిగ్నల్‌లో పొరపాటు జరగడంతో అది గూడ్స్‌ రైలు నిలిపిఉంచిన లూప్‌లైన్‌లోకి ప్రవేశించింది. దీంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నట్లు అక్కడ పోలీసాధికారి వెల్లడించారు. గాయపడిన వారిని సిబ్బంది దగ్గల్లోని ఆసుపత్రులకు తరలించి, అత్యవసర చికిత్స అందిస్తున్నారు. భోగీల్లో చిక్కుకున్నవారిని బయటకు తీయడానికి హైడ్రాలిక్‌ కట్టర్‌లను తెప్పిస్తున్నారు. సాదిఖాబాద్‌ రైలు ప్రమాద సంఘటన పట్ల పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ విచారం వ్యక్తం చేశారు. కుటుంబాలకు బాసటగా ఉంటామని పేర్కొన్నారు. తరచూ జరుగుతున్న ఈ రైలు ప్రమాద ఘటనలను నిలువరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని పాక్‌ రైల్వే మంత్రికి సూచించారు.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/