21.4 ఓవర్లకే కుప్పకూలిన పాక్‌

PAK vs WI
PAK vs WI

నాటింగ్‌హామ్‌: ప్రపంచకప్‌ టోర్నీలో తొలి మ్యాచ్‌ ఆడుతున్న పాకిస్తాన్‌ జట్టు వెస్టిండీస్‌ బౌలింగ్‌ ధాటికి కుప్పకూలింది. 20 ఓవర్లు పూర్తి కాకుండానే 9 వికెట్లు కోల్పోయింది. 19వ ఓవర్‌లో జట్టు స్కోరు 83 పరుగుల వద్ద ఉన్నపుడు మహ్మద్‌ హఫీజ్‌(16) థామన్‌ బౌలింగ్‌లో కాట్రెల్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. జట్టు స్కోరు 81 పరుగుల వద్ద హసన్‌ అలీ వికెట్‌ పడింది. 18 వ ఓవర్‌లో హోల్డర్‌ వేసిన బంతిని కాట్రెల్‌కు క్యాచ్‌ ఇచ్చి హసన్‌ అలీ వెనుదిరిగాడు. 17వ ఓవర్‌లో షాబాద్‌ ఖాన్‌ డకౌట్‌ అయ్యాడు. థామస్‌ బౌలింగ్‌లో ఎల్బీ అయ్యి పరుగులు తీయకుండానే వెనుదిరిగాడు. హోల్డర్‌ వేసిన బంతిని గేల్‌కు క్యాచ్‌ ఇచ్చి ఇమద్‌ వాసిమ్‌(1) ఔటయ్యాడు. 16వ ఓవర్‌లో హోల్డర్‌ వేసిన తొలి బంతిని హోప్‌కు క్యాచ్‌ ఇచ్చిన పాక్‌ కెప్టెన్‌ సర్ఫ్‌రాజ్‌ అహ్మద్‌ కేవలం 8 పరుగుల స్వల్ప స్కోరుతో వెనుదిరిగాడు. 21.4 ఓవర్లకే పాకిస్తాన్‌ జట్టు ఆలౌటయ్యింది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/