రాజకీయవేత్తగా అఫ్రిదికి మంచి నైపుణ్యం

shahid afridi, imran farhat
shahid afridi, imran farhat

పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ షాహిద్‌ అఫ్రిది స్వార్థపరుడని, అనేక మంది యువ క్రికెటర్ల కెరీర్‌ను నాశనం చేశాడని ఆ జట్టు మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ ఫర్హాత్‌ విమర్శలు చేశాడు. అఫ్రిది తన ఆటో బయోగ్రఫీ గేమ్‌ చేంజర్‌లో కాశ్మీర్‌ అంశం, 2010 స్పాట్‌ ఫిక్సింగ్‌, తన వయసు తదితర విషయాలను వెల్లడించాడు.
అఫ్రిది వ్యాఖ్యలపై తాజాగా పాక్‌ మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ ఫర్హాత్‌ వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డాడు. ఆయన తన ఆటో బయోగ్రఫీలోని చాలా విషయాలు వాస్తవాలు కాదని, కొన్ని అంశాలు చదివినందుకు తనకు చాలా సిగ్గుగా ఉందని, ఇది సరైన పద్ధతి కాదని ఇమ్రాన్‌ తెలిపారు. రాజకీయవేత్త అయ్యేందుకు అఫ్రిదికి మంచి నైపుణ్యం ఉందని, తన స్వార్ధం కోసం ఎంతో మంది యువ ఆటగాళ్ల కెరీర్‌లను నాశనం చేశాడని అన్నాడు. అతడి చేతిలో మోసపోయిన ఆటగాళ్లు తమకు జరిగిన అన్నాయాన్ని వెల్లడించాలని ట్విట్టర్‌ వేదికగా ఇమ్రాన్‌ కోరాడు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/