పాక్‌లో కుప్పకూలిన యుద్ధ విమానం

రిపబ్లిక్ డే కోసం రిహార్సల్స్ నిర్వహిస్తుండగా ప్రమాదం.. వింగ్ కమాండర్ దుర్మరణం

Pakistan Air Force F-16 crashes
Pakistan Air Force F-16 crashes

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో ఈనెల 23న గణతంత్ర దినోత్సవాలు జరగనున్నాయి. ఈసందర్భంగా రిహార్సల్స్‌ నిర్వహిస్తున్న పాక్‌ యుద్ధ విమానం ఎఫ్‌-16 ఫైటర్‌ జెట్‌ కుప్పకూలింది. ఈ ప్రమాదం ఆ దేశ రాజధాని ఇస్లామాబాద్ సమీపంలో జరిగింది. ఈ ప్రమాదంలో వింగ్ కమాండర్ నౌమాన్ అక్రం ప్రాణాలు కోల్పోయారు. ఘటన జరిగిన వెంటనే సహాయక బృందాలు అక్కడకు తరలి వెళ్లాయి. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. భారీగా పొగ వ్యాపించింది. విమానం కుప్పకూలిన ప్రాంతంలో ప్రదర్శనశాలలు, గోల్ఫ్ క్లబ్ లు, జిన్నా స్టేడియం ఉన్నాయి.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/