రేపు విపక్షాల సమావేశం

opposition parties
opposition parties


న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఘోరపరాజయం చవిచూసిన ప్రతిపక్ష పార్టీలన్నీ తదుపరి కార్యాచరణపై దృష్టి సారించాయి. ఈ మేరకు మే 31న పార్టీలన్నీ పార్లమెంటు హాలులో సమావేశం కానున్నాయి. ఈ భేటికి కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వం వహించనుంది. ఇప్పటికే ఎవరికివారు ఓటమికి గల కారణాలను అంతర్గతంగా విశ్లేషించుకున్నాయి. ఓటమిపై ఈ సారి ఉమ్మడిగా చర్చించనున్నాయి. ఫలితాల తర్వాత ప్రతిపక్షాలు భేటి కావడం ఇదే తొలిసారి.
జూన్‌ 6న పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయన్న వార్తల నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రధాని మోది ప్రమాణ స్వీకారం చేయనున్న మరుసటి రోజే ఈ భేటీ జరగనుండడం చర్చనీయాంశంగా మారింది.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/