ఈ 25న వివిప్యాట్‌ల స్లిప్పుల లెక్కింపుపై విచారణ

supreem court
supreem court


న్యూఢిల్లీ: వీవీప్యాట్‌ స్లిప్పుల అంశంపై సుప్రీంలో ఇవాళ విచారణ జరిగింది. దేశంలోని 21 పార్టీలు కలిసి ఈవిఎంలతో పాటు 50 శాతం వివిప్యాట్‌ స్లిప్పులు లెక్కించాలంటూ సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేశాయి. దానిపై సుప్రీం నేడు విచారణ జరిపింది. ఈ నెల 25న సమగ్రంగా విచారిస్తామని సుప్రీం ప్రధాన న్యాయమూర్తితో కూడిన త్రిసభ్య ధర్మాసనం చెప్పింది. దీనిపై సమాధానం ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణ జరిగేటప్పుడు ఎన్నికల అధికారిని అందుబాటులో ఉంచాలని ధర్మాసనం ఆదేశించింది. ఈవిఎంలతో పాటు 50 శాతం వివి ప్యాట్‌లను లెక్కించాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోరారు.