చెన్నైలో నీటి ఎద్దడిపై స్పందించిన డికాప్రియో

Leonardo DiCaprio
Leonardo DiCaprio

తమిళనాడు రాజధాని చెన్నైలో నీటి కొరత నానాటికీ తీవ్రంగా మారుతుంది. వర్షాలు లేక, రిజర్వాయర్లు ఎండిపోయి చుక్కనీరు కూడా దొరక్క అల్లాడిపోతున్నారు. చెన్నై వాసుల దుస్థితిపై ప్రముఖ హాలీవుడ్‌ హీరో, పర్యావరణ వేత్త లియోనార్డో డికాప్రియో విచారం వ్యక్తం చేశారు. ఎండిపోయిన బావి నుంచి నీరు తోడేందుకు ప్రజలు పడుతున్న అవస్థలను ప్రతిబింబించే ఫోటోను డికాప్రియో తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్టు చేశారు. దీంతో పాటు నీటి కష్టాలపై ఈ అంతర్జాతీయ మీడియా రాసిన కథనాన్ని కూడా రీషేర్‌ చేశారు.

తాజా హీరోయిన్‌ల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actress/