ఈఫిల్‌ టవర్‌కు 800 మీటర్ల జిప్‌లైన్‌ ఏర్పాటు

Eiffel Tower zipline
Eiffel Tower zipline

పారిస్‌: ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణాల్లో ఒకటైన ఈఫిల్‌ టవర్‌పై సందర్శుకుల కోసం మరో సాహసోపేతమైన వినోదం అందుబాటులోకి విచ్చింది. ఈఫిల్‌ టవర్‌ నుంచి కిందకు 800 మీటర్ల మేర జిప్‌లైన్‌ను నిర్మించారు. ఈఫిల్‌ టవర్‌పైకి చేరుకుంటున్న సాహసికులు ఆ జిప్‌లైన్‌ ద్వారా త్వరగా కిందకు రావడానికి వీలుంటుంది. గంటకు 90 కిలోమీటర్ల వేగంతో కిందనున్న భవనంపైకి దూసుకుపోతున్నారు. నెస్లీ గ్రూప్‌కు చెందిన మినరల్‌ వాటర్‌ తయారీ సంస్థ పెరియర్‌ ఈ జిప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/