మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

పెట్రోలుపై లీటర్‌కు 5 పైసలు, డీజిల్‌పై 13 పైసలు పెంపు

petrol & diesel
petrol & diesel

ముంబయి: దేశంలో పెట్రోల్‌ధరలు పెరుగుతున్నాయి. పెట్రోలుపై ఈ రోజు లీటర్‌కు 5 పైసలు, డీజిల్‌పై 13 పైసలు పెరిగాయి. 23 రోజుల్లో లీటర్‌ డీజిల్‌పై మొత్తం రూ.10.39, లీటర్‌ పెట్రోల్‌పై రూ.9.23 పెరిగాయి. పెరిగిన ధరల అనంతరం ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకి రూ.80.43గా ఉండగా, డీజిల్ ధర రూ.80.53గా ఉంది. ఇక, హైదరాబాద్‌లో పెట్రోల్‌ లీటరుకు రూ.83.49, డీజిల్ రూ.78.69, విజయవాడలో పెట్రోల్‌ రూ.84.15, డీజిల్ రూ.79.19గా ఉంది. ముంబైలో లీటరు పెట్రోల్‌ ధర రూ.87.19, డీజిల్ ధర రూ.78.83, చెన్నైలో లీటరు పెట్రోల్‌ రూ.83.63, డీజిల్ రూ.77.72గా ఉంది. ఆయా రాష్ట్రాలు విధించే పన్నుల్లో తేడాల కారణంగా ఆయా ప్రాంతాల్లో ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి.

జా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/