310కి చేరిన శ్రీలంక పేలుళ్ల మృతుల సంఖ్య

bomb blast in srilanka
bomb blast in srilanka

కొలంబో: శ్రీలంక వరుస పేలుళ్లలో మృతి చెందిన వారిసంఖ్య 310కి చేరుకున్నది. ఆ పేలుళ్లలో 500 మంది గాయపడ్డారు. సోమవారం రాత్రి నుంచి శ్రీలంకలో అత్యవసర పరిస్థితి అమలులోకి వచ్చింది. ఇప్పటి వరకు పోలీసులు ఉగ్ర ఘటనకు సంబంధించి 40 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ జాతీయ సంతాప దినాన్ని పాటిస్తున్నారు. బాంబు పేలుళ్ల ఘటనలో విచారణకు సహకరించేందుకు ఇంటర్‌పోల్‌ ఓ టీమ్‌ను శ్రీలంకకు పంపించింది. శ్రీలంక పేలుళ్ల ఘటనను ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ మద్దతుదారులు సెలబ్రేట్‌ చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఏ గ్రూప్‌ కూడా పేలుళ్లకు బాధ్యత వహించలేదు. శ్రీలంక ఇంటిలిజెన్స్‌ మాత్రం తౌహీద్‌ జమాతేను అనుమానిస్తున్నది. షాంగ్రిలా హోటల్‌లో ఆత్మాహుతికి పాల్పడిన వ్యక్తిని ఇన్‌సాన్‌ సీలావన్‌గా గుర్తించారు. సూసైడ్‌ బాంబర్‌కు ఇతర కిల్లర్స్‌తో లింకులు ఉండి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/