ఎన్టీఆర్ బయోపిక్ పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి

NTR  BIOPIC
NTR BIOPIC

నందమూరి బాలకృష్ణ – క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి ఉన్న విషయం తెలిసిందే.  ఈ సినిమా ఒక్కభాగంలాగానే మొదట ప్లాన్ చేసినప్పటికీ ఆ తర్వాత మాత్రం ‘ఎన్టీఆర్ కథానాయకుడు’.. ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ అంటూ రెండు భాగాలుగా విడుదల చేస్తామని మొదటి భాగం జనవరి 9 వ తేదీన రెండవ భాగం జనవరి 24 న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ క్రిష్ అండ్ టీమ్ తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ రిలీజ్ డేట్ పోస్టర్లో క్లియర్ గా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ అని తెలిపారు. అంటే డిసెంబర్ 21 న మొదటిభాగం ట్రైలర్ రిలీజ్ అవుతుందన్నమాట.  ఈ లెక్కన ఎన్టీఆర్ రెండు భాగాలుగా రిలీజ్ అవుతుంది.  ప్రస్తుతం ఫోకస్ అంతా ‘కథానాయకుడు’ మీదే.  రెండో భాగం ‘మహానాయకుడు’ ఫిబ్రవరి 7 న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయిగానీ అధికారికంగామాత్రం ఇంకా ప్రకటించలేదు.