నామినేషన్లకు బారులు తీరిన నిజామాబాద్‌ రైతులు

nizamabad farmers
nizamabad farmers


నిజామాబాద్‌: పసుపు పంటకు మద్దతు ధర డిమాండ్‌ చేస్తూ నిజామాబాద్‌ జిల్లాలో రైతులు నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. తమ ఆవేదనను ఎవరూ పట్టించుకోకపోవడంతో నిజామాబాద్‌ లోక్‌సభ స్థానానికి స్వయంగా రైతులే నామినేషన్లు వేస్తున్నారు. దాఖలైన నామినేషన్లలో ఎక్కువ శాతం రైతుల నామినేషన్లే ఉన్నాయి. నేడు నామినేషన్లకు చివరి తేదీ కావడంతో రైతులు పెద్దఎత్తున నామినేషన్లు దాఖలు చేయడానికి కలెక్టరేట్‌కు వచ్చారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్‌ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించారు. పసుపు, ఎర్రజొన్న రైతులతో పాటు చెరకు రైతులు నామినేషన్‌ వేయనున్నారు.