ప్రారంభమైన నీతి ఆయోగ్‌ సమావేశం

ఏపికి ప్రత్యేక హోదా ఆవశ్యకంపై వివరించనున్న జగన్‌

narendra modi
narendra modi, NITI AAYOG chairman, pm

న్యూఢిల్లీ: న్యూఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్‌లోని సాంస్కృతిక కళా కేంద్రంలో ప్రధాని మోది అధ్యక్షతన నీతి ఆయోగ్‌ పాలకమండలి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో మూడు రాష్ట్రాల సియంల మినహా మిగతా రాష్ట్రాలకు చెందిన సియంలు, కేంద్రపాలితప్రాంతాల లెఫ్టినెంట్‌ గవర్నర్‌లు, కేంద్ర హోంశాఖ, రక్షణ, ఆర్ధిక శాఖ మంత్రులు ,నీతి ఆయోగ్‌ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ రోజు రాత్రి 7 గంటల వరకు ఈ సమావేశం కొనసాగే అవకాశం ఉంది. ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన ఆవశ్యకతను వివరించేందుకు ఇప్పటికే నివేదిక సిద్దం చేసిన ఏపి సియం జగన్‌ ఈ అంశాన్ని భేటిలో ప్రస్తావించనున్నారు. విభజన సమస్యల పరిష్కారం, లోటు బడ్జెట్‌ వివరాలను నీతి ఆయోగ్‌ ముందు ఉంచనున్నారు.
చర్చకు వచ్చే అంశాలు:
ఈ భేటిలో వర్షపు నీటి సమర్ద వినియోగం, కరవు పరిస్థితిపై సమీక్ష-ఉపశమన చర్యలు, వెనుకబడిన జిల్లాల అభివృద్ది పథకం-సాధించిన లక్ష్యాలు-సవాళ్లు, నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించడం, వ్యవసాయ రంగ పరిపుష్టి, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌ కమీటీ చట్టం, నిత్యావసర వస్తువుల చట్టంపై ప్రత్యేక దృష్టి, జాతీయాభివృద్ది, ఏక్‌ భారత్‌-శ్రేష్ఠ భారత్‌, గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల్లో పురోగతి, భవిష్యత్‌ లక్ష్యాలపై కీలకంగా చర్చించనున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/