కొత్తగా కిసాన్‌ రైలు

Nirmala Sitaraman in Budget session

New delhi: కొత్తగా కిసాన్‌ రైలు ప్రవేశపెడతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. లోక్‌సభలో నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పత్తుల తరలింపునకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తామన్నారు. జీరో బడ్జెట్‌ వ్యవసాయానికి ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపునకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వ్యవసాయరంగాభివృద్ధికి 16 సూత్రాల పథకం అమలు చేస్తామన్నారు. ఆర్గానిక్‌ ఉత్పత్తుల మార్కెటింగ్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. కొత్తగా ఒక జిల్లా-ఒక ఉత్పత్తి ఫార్ములాకు శ్రీకారం చుడుతున్నామన్నారు. సమీకృత రైతు వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామన్నారు. పెన్షన్‌, బీమా విస్తరణతో సామాజిక భద్రత కల్పిస్తున్నామన్నారు. డిజిటల్‌ గవర్నెన్స్‌ ద్వారా నిరాటంక సేవలు అందుతున్నాయన్నారు.

రైతుల కోసం కృషి ఉడాన్ పథకం

రైతుల కోసం కృషి ఉడాన్ పథకం తీసుకొస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. లోక్ సభలో 2020-2021 బడ్జెట్ ప్రసంగంలో ఆమె మాట్లాడుతూ… వ్యవసాయ ఉత్పత్తుల నిల్వలకు కొత్త గోదాములు ఏర్పాటు చేస్తామన్నారు. సేంద్రీయ ఉత్పత్తుల విక్రయానికి ఆన్ లైన్ పోర్టల్ ఏర్పాటు చేస్తామన్నారు.

నీటి ఎద్దడి ఉన్న 100 గ్రామాలకు ప్రత్యేక ప్యాకేజి

నీటి ఎద్దడి ఉన్న 100 గ్రామాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వనున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. విమానాల ద్వారా పంటల రవాణాకు కృషి ఉడాన్‌ పథకం ప్రవేశపెడుతున్నామని అన్నారు. అలాగే రైల్వేలో కిసాన్‌ రైలును ప్రవేశపెట్టనున్నామని ఆమె చెప్పారు. ఆర్గానిక్‌ ఫార్మింగ్‌అకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ మార్కెటింగ్‌కు జాతీయ స్థాయిలో పథకం అమలు చేస్తామన్నారు.

మత్స్యకారులకు సాగర్ మిత్ర పథకం 

మత్స్య కారులకు సాగర్ మిత్ర పథకం తీసుకొస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. లోక్ సభలో 2020-2021 బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు. గ్రామాల్లో గోదాముల నిర్వహణను స్వయం సహాయ బృందాలకు అప్పగిస్తామన్నారు. కిసాన్ క్రెడిట్ పేరుతో రైతులకు మరిన్ని రుణాలు అందజేస్తామన్నారు.

అదుపులో ద్రవ్యోల్బణం

ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని చెప్పిన నిర్మల, ఆర్థిక వ్యవస్థను సంఘటిత పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆరోగ్యకరమైన వాణిజ్య వృద్ధికి తోడ్పాటు ప్రభుత్వం విస్తృత సంస్కరణలు చేపట్టింది ద్రవ్యోల్బణం అదుపులో ఉంది

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/nri/