ధోనిని తక్కువ అంచనా వేయకండి

clarke, dhoni
clarke, dhoni


మెల్‌బోర్న్‌: ఇటీవల కాలంలో ధోని భారత జట్టులో కొనసాగడంపై పలువురు విమర్శలు చేయగా.. దీనిపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌ స్పందించారు. ధోనీపై విమర్శలు చేసి అతని ఖ్యాతిని తగ్గించడం మంచిది కాదన్నారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతడి అవసరం చాలా ఉందని పేర్కొన్నారు.
త్వరలోనే వన్డే వరల్డ్‌కప్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో ధోని ప్రాధాన్యతను తక్కువ చేస్తూ విమర్శలు చేయడం సరైంది కాదంటూ.. మధ్య ఓవర్లో ఆయన అనుభవం అత్యంత కీలకమని తెలిపారు. భారత్‌కు రెండు సార్లు వరల్డ్‌కప్‌ సాధించిన ఘనత అతనిదే అని ధోని ఆటను ప్రశంసించారు. 2007 మరియు 2011లో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో ధోని సారథ్యంలో భారత జట్టు ప్రపంచకప్‌ గెలిచిందని మరోసారి గుర్తు చేశారు.