నీర‌వ్ మోది అరెస్టు

neerav modi
neerav modi

లండన్: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు చెందిన రూ.13 వేల కోట్ల స్కాంలో ప్రధాన నిందితుడైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని బుధవారం లండన్‌లో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతన్ని లండన్‌లోని ఓ కోర్టులో హాజరు పరిచారు. అతన్ని ఇండియాకు అప్పగించే ప్రక్రియ త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్యే అతడు లండన్ వీధుల్లో తిరుగుతూ కెమెరా కంట పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వెస్ట్‌మిన్‌స్టర్ కోర్టు అతనికి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. గతేడాది ఫిబ్రవరిలో ఈ పీఎన్‌బీ స్కాం బయటపడక ముందే నీరవ్ మోదీ దేశం వదిలి పారిపోయాడు.