నవీన్‌ ప్రమాణ స్వీకారానికి మోదికి ఆహ్వానం

naveen patnaik, modi
naveen patnaik, modi

భువనేశ్వర్‌: ఒడిశా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదిని ఆహ్వానించారు. నవీన్‌ పట్నాయకే స్వయంగా ఫోన్‌ చేసి ఈ విషయాన్ని చెప్పినట్లు తెలుస్తుంది. మోదితో పాటు దేశంలోని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించారు. నవీన్‌ పట్నాయక్‌ బుధవారం నాడు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు బిజెడి పార్టీ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.
మొత్తం 147 సీట్లున్న ఒడిశాలో 146 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో బిజెడి 112 స్థానాలు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. కాగా ఒడిశా ముఖ్యమంత్రిగా నవీన్‌ పట్నాయక్‌ ఐదోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

తాజా హీరోయిన్‌ల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actress/