దేశవ్యాప్త తొలిదశ పోలింగ్‌సమాప్తం

20 రాష్ట్రాల్లో 91 నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్‌…

Nationwide first time polling
Nationwide first time polling

న్యూఢిల్లీ: ఇవిఎంలు పనిచేయకపోవడం, పోలింగ్‌ మూడునుంచి నాలుగుగంటలపాటు ఆలశ్యంగాప్రారంభం కావడం, కొన్ని చోట్ల చెరుదుమదురుఘర్షణలతో తొలిదశ పోలింగ్‌ముగిసింది. ఆంధ్రప్రదేశ్‌లోఎన్నికల ఘర్షణల్లో అనంతపురంజిల్లాలో ఒకరు, చిత్తూరుజిల్లాలో ఒకరు మృతిచెందారు. ప్రపంచంలోని అతిపెద్దప్రజాస్వామిక దేశంలో ఎవరు పాలన పగ్గాలు చేపడతారన్నది తొలిదశ పోలింగ్‌నుంచే వ్యక్తం అవుతున్నట్లుగా పోలింగ్‌ సరళి కొనసాగింది. మొత్తం 545 స్థానాల్లో తొలిదశలో 91 స్థానాలు 18 రాష్ట్రాలు, రెండుకేంద్రపాలిత ప్రాంతాల్లో జరిగాయి. మెజార్టీ మార్కు 272 స్థానాలు సాధించాల్సిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, మేఘాలయ, ఉత్తరాఖండ్‌, మిజోరమ్‌, నాగాలాండ్‌, సిక్కిమ్‌, లక్షద్వీప్‌, అండమాన్‌ నికోబార్‌ దీవులు, తెలంగాణల్లో ఒకేవిడతపోలింగ్‌లో ఎన్నికలుముగిసాయి. అస్సాం బీహార్‌, ఛత్తీస్‌ఘర్‌, జమ్ముకాశ్మీర్‌,మహారాష్ట్ర,మణిపూర్‌, ఒడిశా, త్రిపుర, ఉత్తరప్రదేశ్‌, వెస్ట్‌బెంగాల్‌రాష్ట్రాల్లో కొన్ని నిజయోజకవర్గాలకు మొదటిదశలో ఎన్నికలు జరిగాయి. ఎపిలో మొత్తం 362 ఇవిఎంలు పనిచేయలేదని వాటిని బదలాయించినట్లు తెలిపారు. ఇక మహారాష్ట్ర, ఈశాన్యరాష్ట్రాల్లో కొన్నిచోట్ల మందుపాతరలు పేలాయి. అయితే ఎవ్వరూ మృతిచెందినట్లు నమోదుకాలేదు. పోలింగ్‌ మందకొడిగా సాగింది. ఉత్తరప్రదేశ్‌లోపోలింగ్‌చూస్తే 50శాతంగానే ఉన్నట్లు అంచనావేసారు. యుపిలో అఖిలేష్‌యాదవ్‌,మాయావతి కూటమి గట్టిపోటీనిచ్చింది. ఎనిమిది స్థానాలుకు పోటీజరిగింది. కీలకంగా సహరాన్‌పూర్‌, కైరానా, ఘజియాబాద్‌, భాగ్‌పట్‌, గౌతమ్‌బుద్ధనగర్‌ నియోజకవర్గాలకు జరిగింది. కీలకనేతల్లో ఐదుగురు కేంద్రమంత్రులు నేడుపోటీలో ఉన్నారు. నాగ్‌పూర్‌నుంచి కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ, అరుణాచల్‌వెస్ట్‌నుంచి కిరెన్‌ రిజిజు, జనరల్‌ వికెసింగ్‌ ఘజియాబాద్‌, భాగ్‌పట్‌నుంచి సత్యపాల్‌సింగ్‌, గౌతమ్‌బుద్ధనగర్‌నుంచి మహేశ్‌శర్మలు, ఆర్‌ఎల్‌డి చీఫ్‌ అజిత్‌సింగ్‌, ఆయనకుమారుడు జయంత్‌చౌదరి,హంస్‌రాజ్‌ ఆహిర్‌ చంద్రాపూర్‌, వ్యవసాయ శాఖ సహాయ మంత్రి సంజీవ్‌బల్యాన్‌లు పోటీచేసిన ప్రముఖుల్లో ఉన్నారు. ఇక బీహార్‌లో ఎల్‌జెపి నేత చిరాగ్‌పాశ్వాన్‌ జాముయి నియోజకవర్గంనుంచి పోటీచేస్తునఆనరు. ఈశాన్యంలో కిరణ్‌రిజిజు, అస్సామ్‌లో మాజీ సిఎం తరుణ్‌ గగో§్‌ు కుమారుడు గౌరవ్‌ కాలియాబార్‌నుంచి పోటీలో ఉన్నారు. చబిజెపిమేనిఫెస్టోలో 20 లక్షలకోట్లు వ్యవసాయర ంగం, గ్రామీణాభివృద్ధికికటాయిస్తామని, మధ్యతరగతికి తక్కువ పన్నులు, రూ.100 లక్షలకోట్ల మౌలికవనరుల సృష్టి ఉపాధి రంగానికి మరింత ఊతం వంటి హామీలిచ్చింది. ఇక కాంగ్రెస్‌ పార్టీన్యా§్‌ుపథకం ప్రధాన హామీగా చూపించింది. ఏడాదికి 72 వేలరూపాయలు మూడేళ్లపాటు నిరుపేదల కుటుంబాలకు అందిస్తామని వెల్లడించింది. అభిప్రాయసేకరణలో ప్రధాని మోడీకే మళ్లీ ఎక్కువ అవకాశాలున్నట్లు కనిపిస్తోందని చెపుతున్నాయి. ఆర్ధికవ్యవస్థ పతనం, ఉపాధి సృష్టిలో విఫలం, వ్యవసాయ రంగ సంక్షోభానికి కారణమన్న వాదనలు విమర్శలు పెరిగినా ఎక్కువ ఉగ్రవాదం, గోవధనియంత్రణలో విజయం సాధించింది. దేశవ్యాప్తంగా మూకహత్యల అపవాదును మాత్రంమూటగట్టుకుంది. గడచిన ఐదేళ్లుగా బిజెపి కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ అన్న నినాదంతోనే పనిచేస్తోంది. 12 రాష్ట్రాల్లో అధికారాన్ని కైవసం చేసుకుంది. వీటిలో ఏడు ఈశాన్యరాష్ట్రాలు ఉత్తరప్రదేశ్‌కూడా ఉంది. పంజాబ్‌లో విజయం సాధించి, మోడీ సొంతరాష్ట్రం గుజరాత్‌లో గట్టిపోటీ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ కర్ణాటక, రాజస్థాన్‌మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ఘర్‌లలో బిజెపినుంచి అధికారాన్ని కైవసం చేసుకుంది. అదేకోణంలో చూస్తే ఇపుడు తిరిగి తమకు అధికారం తప్పదన్న భావన కాంగ్రెస్‌ శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది. ఈ ఎన్నికల్లో దేశభద్రత, రక్షణ, అభివృద్ధి, వ్యవసాయ రంగ ఉపశమనం, సంక్షేమపథకాలనినాదంతో బిజెపి అధికారంలోనికి వస్తుండటంతో ప్రతిపక్షంలోని కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అవినీతి, పెట్టుబడిదారీ వ్యవస్థకు మద్దతు అన్న నినాదంతో ఎన్నికల్లోనికి వస్తోంది. రాఫెల్‌డీల్‌, జిఎస్‌టి, గోవధ, మూక హత్యలు వంటి నినాదాలుమిన్నంటుతున్నాయి.
ఇక తొలిదశ పోలింగ్‌లో ఓటర్లు అత్యధికసంఖ్యలో వచ్చారని ఎన్నికల సంఘం చెపుతోంది. ఎకక్కువగా ఇవిఎంలు పనిచేయలేదన్న ఫిర్యాదులే ఎన్నికలసంఘానికి అందాయి. ఓటర్ల జాబితాలనుంచి పేర్లు తొలగించారన్న ఫిర్యాదులు కూడా వెల్లువలా వచ్చాయి. 18 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలితప్రాంతాల్లో సుమారు 14కోట్లమందికిపైగా ఓటర్లు ఓటింగ్‌లోపాల్గొన్నారు. దేశంలో ఉన్న సుమారు 90 కోట్లమంది ఓటర్లలో ఆరోవంతు తొలిదశపోలింగ్‌లోపాల్గొన్నారు. 543 స్థానాలకు ఏడువిడతలుగా జరిగే ఎన్నికలకు వచ్చేనెల 23వ తేదీ ఓట్లలెక్కింపు జరుగుతుంది. 18-19 ఏళ్లమధ్యవసున్న కొత్త యువ ఓటర్లు 1.5 కోట్లమంది ఏడుదశల ఓటిండగ్‌లోను పాల్గొంటున్నారు. 2014 ఎన్నికల్లో సుమారు 55 కోట్లమంది భారతీయులుఓటుహక్కు వినియోగించుకున్నారు. 66.3శాతం పోలింగ్‌ నమోదయింది. బిజెపి విజేతగా 30శాతం ఓట్లతో గెలిచింది. ప్రధానినరేంద్రమోడీ ప్రభుత్వం ఐదేళ్లపాటు కొనసాగింది. మొదటిదశ ఎన్నికల్లో బిజెపి 32 స్థానాలు గెలుచుకోవాలనిచూస్తోంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌పార్టీ ఏడుస్థానాలు 2014లో గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘర్‌, ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌లలో ఈసారి ఎక్కువ గురిపెట్టింది. ఆంధ్రప్రదేశ్‌లో 175 స్థానాలు, సిక్కింలో 32, అరుణాచల్‌ప్రదేశ్‌లో 57స్థానాలు, 28 స్థానాలు ఒడిశా అసెంబ్లీకి తొలిదశ పోలింగ్‌జరిగింది. మొదటిదశ ఎన్నికల్లో 25స్థానాలు ఆంధ్రప్రదేశ్‌, 17స్థానాలు తెలంగాణ, ఐదు ఉత్తరాఖండ్‌, రంఎడు మేఘాలయ, రెండుఅరుణాచల్‌ప్రదేశ్‌, మిజోరమ్‌, త్రిపుర, మణిపూర్‌, నాగాలాండ్‌, సిక్కిమ్‌, అండమాన్‌నికోబార్‌, లక్షద్వీప్‌ ప్రాంతాల్లో ఒక్కొక్కస్థానానికి పోలింగ్‌జరిగింది. యుపిలో ఎనిమిది, మహారాష్ట్రలో ఏడు, అస్సాంలో ఐదు, బీహార్‌,ఒడిశాల్లో నాలుగుచొప్పున జమ్ముకాశ్మీర్‌,పశ్చిమబెంగాల్‌ రా€ష్టాల్లో రెండేసి స్థానాలకు పోలింగ్‌ముగిసింది. ఛత్తీస్‌ఘర్‌లో ఒకస్థానానికి తొలిదశలోనే జరిగింది. మధ్యాహ్నం వరకూ 40 నుంచి 50శాతానికి పోలింగ్‌మించలేదని వెల్లడి అయింది.

మరిన్నీ తాజా క్రీడా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/