పూజలు ఓకే.. భూములు మాత్రం మావే:

suprem court
suprem court

అయోధ్యపై ముస్లిం నేతలు


న్యూఢిల్లీ: అయోధ్యలో వివాదాస్పద రామజన్మభూమి – బాబ్రీ మసీదు 2.77 ఎకరాల భూమి ఆవరణలో రాముడి విగ్రహానికి హిందువులు పూజించుకునేందుకు తమకు సమ్మతమేనని ముస్లిం సంఘాలు సుప్రీంకోర్టులో తెలిపాయి. అయితే హిందువులు పూజించుకునేందుకు ఒప్పుకున్నాం. కానీ, ఆ భూమి వారికి చెందుతుందంటే మాత్రం అంగీకరించమని చెప్పాయి. ముస్లిం సంఘాల తరపున న్యాయవాది రాజీవ్‌ ధావన్‌ వాదించారు. ఆ భూమిలో హిందువులు పూజించుకునేందుకు అంగీకారమే. కానీ, వక్ఫ్‌ బోర్డుపైనే వివాదాస్పద భూమి ఉండాలి. హిందువులు, ముస్లింలం కలిసి ఉంటాం. కానీ, అది మా ఆస్తి. ఇక్కడికి వచ్చి పూజలు చేసుకునే వారికి మాత్రం అనుమతిస్తాం అని న్యాయవాది ధావన్‌ వ్యాఖ్యానించారు. వివాదాస్పద రామజన్మభూమి – బాబ్రీ మసీదు కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు నిర్మోహి అఖారా హక్కులపై వివరణ కోరింది. వివాదాస్పద రామజన్మభూమి బాబ్రీ మసీదు ఆవరణ నిర్మోహి అఖారా ఆధీనంలో ఉండగా.. దీనిని రామ్‌లల్లాకు ఇచ్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకటించింది. అయితే, ఈ ప్రాంతం వివాదాస్పదంగా ఉండటంతో దానిపై నిర్మోహి అఖారాకు హక్కులున్నాయా? లేవా? అనే అంశంపై అభిప్రాయాలు వ్యక్తం చేయాలని ఈ కేసులో వాదులుగా ఉన్న ముస్లిం మత సంఘాలను సుప్రీంకోర్టు సూచించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌గగో§్‌ు నేతృత్వంలోని అయిదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది. ప్రతివాదులుగా ఉన్న సున్నీ వక్ఫ్‌ బోర్డు తొలుత వివాదాస్పద స్థలంపై సిద్దిఖీ కేసు వేశారు. నిర్మోహి అఖారాకు మాత్రమే రామజన్మభూమిలో పూజాది కార్యక్రమాలు నిర్వహించే హక్కు ఉన్నట్లు సిద్దిఖీ ఒక ప్రకటనలో వెల్లడించారు. అఖారాకు ఉన్న హక్కులను అంగీకరిస్తున్నారా? అన్నది స్పష్టం చేయాలని ముస్లిం సంఘాలను సుప్రీం సూచించింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/international-news/