ముంబైలో భారీ వర్షాలు, నిలిచిన ట్రాఫిక్‌

mumbai rains
mumbai rains

ముంబై: ఆర్థిక ముంబైని వర్షాలు ముంచెత్తుతున్నాయి. శుక్రవారం తెల్లవారుఝామున నుంచి ఇక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రవాణా సేవలకు అంతరాయం కలిగింది. పలు చోట్ల ట్రాఫిక్‌ను మళ్లించారు. జూన్‌ 29 వరకు ముంబైలో ఇదే విధంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నగరంలోని ప్రధాన ప్రదేశాలతో పాటు శివారు ప్రాంతాలైన విహార్‌, జుహు, ములుంద్‌ల్లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి.
వాతావరణం అనుకూలించకపోవడంతో కొన్ని విమాన సర్వీసులను నిలిపివేశారు. మరి కొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. వర్షం కారణంగా ముంబై విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

తాజా యాత్ర వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/tours/