ముంబయిలో 30 విమానాలు రద్దు!

mumbai airport
mumbai airport


ముంబయి: రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో వరద ముంచెత్తుతోంది. వాణిజ్య రాజధానిగా పేరుగాంచిన ముంబయితో పాటు పలు చోట్ల కుండపోత వర్షాలు పడుతున్నాయి. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దాంతో ముంబయి వాసులు అప్రమత్తమయ్యారు. అధికారులు కూడా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. ఇక రాజధాని నగరం పరిస్థిది దారుణంగా తయారైంది. భారీ వర్షాల వల్ల దాదాపు 2 కోట్ల మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం.

అంతేకాదు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షాలు, వరదల కారణంగా ముగ్గురు మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. పాల్ఘర్‌ జిల్లాలో ఆరేళ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు. విద్యుత్‌ సప్లై నిలిచిపోవడంతో పలు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చీకట్లో మగ్గుతూ కష్టాలు పడుతున్నారు. ఈ వర్షాల కారణంగా 30 విమానాల రాకపోకలు రద్దయినట్లు తెలుస్తోంది. అంతేకాదు విమానాలు చాలా వరకు ఆలస్యంగా నడుస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. అదలా ఉంటే ముంబయి, పాల్ఘర్‌, రా§్‌ుగఢ్‌, థానేలాంటి ప్రాంతాల్లో మరో 24 గంటల్లో భారీ వర్షాలుంటాయని ఐఎండి అధికారులన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి. https://www.vaartha.com/news/international-news/