షుగర్‌ లెవల్స్‌ సాధారణం, ములాయం డిశ్చార్జి

mulayam singh yadav
mulayam singh yadav, SP chief

లక్నో: సమాజ్‌వాదీ పార్టి(ఎస్పి) చీఫ్‌ ములాయం సింగ్‌ యాదవ్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. షుగర్‌ లెవల్స్‌ నమోదు కావడంతో రామ్‌మనోహర్‌ లోహియా ఆస్పత్రిలో ములాయం ఆదివారం నాడు చేరారు. వైద్యపరీక్షలు నిర్వహించి షుగర్‌ లెవల్స్‌ సాధారణ స్థాయిలో ఉన్నాయని వైద్యులు తెలిపారు. దీంతో ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ములాయం వెంట ఆయన సోదరుడు శివపాల్‌ సింగ్‌, మాజీ మంత్రి అహ్మద్‌ హసన్‌ ఉన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/