జియోలో మరో కంపెనీ భారీ పెట్టుబడి

ముబదాలా ఇన్వెస్ట్‌మెంట్…రూ.9093 కోట్లతో వాటా కొనుగోలు.

Mukesh Ambani
Mukesh Ambani

న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌(ఆర్‌ఐఎల్‌)కు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి పెట్టుబడులు భారీగా వస్తున్నాయి. తాజాగా అబుదాబికి చెందిన ముబదాలా ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ మధ్య భాగస్వామ్య ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా రూ .9,093.60 కోట్లను జియో ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. ముబదాలా పెట్టుబడి ప్రాతిపదికన చూస్తే ఇది జియో ప్లాట్‌ఫామ్‌లలో 1.85 శాతం ఈక్విటీ వాటాగా మారుతుంది. కాగా ముబదాలా అబుదాబికి చెందిన గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ కంపెనీ. ముబదాలా అబుదాబి సావరిన్ ఇన్వెస్టర్.  అబుదాబి ప్రభుత్వ గ్లోబల్ పోర్ట్‌ఫోలియో మేనేజర్. ప్రపంచంలోని 5 ఖండాలలో 229 బిలియన్ డాలర్ల పోర్ట్‌ఫోలియోను నిర్వహిస్తుంది. ఈ ఒప్పందం నియంత్రణా సంస్థలు, అలాగే ఇతర అవసరమైన ఆమోదాలకు లోబడి ఉంటుంది.

జియోలో మొత్తం పెట్టుబడుల వివరాలివి..


•9.99 శాతం వాటా కొనుగోలుతో ఫేస్‌బుక్ పెట్టుబడులు రూ. 43,574 కోట్లు
•1.15 శాతం వాటాతో సిల్వర్‌లేక్ పార్ట్‌నర్స్ రూ.5,656 కోట్లు
•2.32 శాతం వాటాతో విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్ రూ.11,367 కోట్లు
•1.34 శాతం వాటాతో జనరిక్ అట్లాంటిక్ రూ.6,598 కోట్లు
•2.32 శాతం వాటాతో కేకేఆర్ రూ.11,367 కోట్లు
•తాజాగా 1.8 5శాతం వాటాతో ముబదాల రూ.9,094 కోట్లు

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/