ధోనికి బ్యాకప్‌ కీపర్‌ వేస్ట్‌

harbhajan singh
harbhajan singh

కోల్‌కత్తా: ప్రపంచకప్‌లో ఆడబోయే భారత జట్టులో ధోనికి ప్రత్యామ్నాయ వికెట్‌ కీపర్‌ అవసరం ఉండబోది హర్భజన్‌ సింగ్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఒకవేళ ధోనికి ప్రత్యామ్నాయం అవసరమైతే ఆ స్థానంలో కేఎల్‌ రాహులను ఆడించడం మేలని, రిషబ్‌పంత్‌ను ,దినేశ్‌ కార్తీక్‌ గానీ ధోనికి ఆల్టర్నేట్‌ కారని భజ్జీ అన్నాడు.
ప్రస్తుతం ధోని అద్భుతంగా ఆడుతున్నాడు. వెన్నునొప్పి ఒక సమస్యగా ఉన్నప్పటికీ ధోని దానిని అధిగామిస్తాడన్న నమ్మకం ఉంది. ఏ సమయంలో ఎలా ఆడాలో ధోనికి బాగా తెలుసు. కేఎల్‌ రాహుల్‌కు జట్టులో స్థానం కల్పిస్తే బాగుంటుందని, వికెట్‌ కీపింగ్‌కు దూరంగా ఉంచినా రాహుల్‌ సేవలు జట్టుకు ఉపయోగపడతాయని చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు హర్భజన్‌ పేర్కొన్నాడు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/